1993లో చిరంజీవి రాజకీయాల్లో వచ్చి ఉంటే.. | If Chiranjeevi came in politics in 1993 | Sakshi
Sakshi News home page

పోలవరం అవినీతివరంగా మారింది: చింతామోహన్‌

Published Wed, Dec 27 2017 11:35 AM | Last Updated on Wed, Dec 27 2017 11:35 AM

If Chiranjeevi came in politics in 1993 - Sakshi

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు అవినీతి వరంగా మారిపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్‌ విమర్శించారు. ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. సొమ్మొకడిదీ సోకొకడిదీ అన్నట్టుగా పోలవరాన్ని మార్చేశారని అన్నారు. అవినీతి మచ్చ లేదంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి పోలవరంలో అవినీతే మరకగా మారిందని వ్యాఖ్యానించారు. పోలవరంలో 50శాతం పైగా అవినీతి ఉందని స్పష్టంగా చెప్పారు. నితిన్ గడ్కరీ కి పేరులోనే నీతి ఉందని కానీ ఆయన చేసేది అంతా అవినీతేనని తూర్పారబట్టారు.

పోలవరం పేరుతో చంద్రబాబు కోట్లు దోచుకుంటున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవాడని చెప్పుకొచ్చారు.  అప్పుడే రాజకీయాల్లోకి చిరంజీవిని రమ్మని తాను కోరినట్లు తెలిపారు. కాపులు, దళితులు ఏకమై రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు.  శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement