సాక్షి, తిరుపతి: రచ్చబండ కార్యక్రమం జిల్లాలో రచ్చ రచ్చగా జరిగింది. ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగిన ర చ్చబండకు పలు చోట్ల సమైక్య సెగ తగిలింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న రచ్చబండ కార్యక్రమాలు ఒక మోస్తరుగా జరిగినా మిగి లిన సమావేశాలు మాత్రం తూతూమంత్రంగా సాగాయి. కొన్ని చోట్ల దరఖాస్తులు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండు విడతలుగా పర్యటిం చి, మూడు ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి గల్లా అరుణ కుమారి తిరుచానూరులోని అర్బ న్ హట్‌లో రచ్చబండ కార్యక్రమం చేపట్టగా, గత హామీలను ప్రశ్నించేందుకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరిలో రచ్చబండను నిర్వహించడానికి ముందే వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కొటాల చంద్రశేఖ ర్ రెడ్డి, యుగంధర్ రెడ్డిని అరెస్టు చేశా రు.
తిరుపతి ఎంపీ చింతా మోహన్‌కు వెళ్లిన ప్రతి చోటా సమైక్య సెగ తగి లింది. నాగలాపురం, పిచ్చాటూరులో ఆయన పాల్గొనగా సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే పరిస్థితి తిరుపతిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలోను ఎంపీకి ఎదురయింది. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో ఈనెల 21వ తేదీన జరిగిన రచ్చబండలో ముందు తమ సమస్యలు వినాలంటూ ప్రజలు పట్టుబట్టడంతో ఎంపీ అర్ధంతరంగా వెనుదిరిగారు. దీనికి నిరసనగా రోడ్డుపై బైఠాయించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని అరెస్టు చేసి విడుదల చేశారు. ఎంపీపై వాటర్ బాటిల్ విసిరారనే ఆరోపణపై మరో ఇద్దరు వైఎస్‌ఆర్ సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీదేవి టేబుల్‌పైకి ఎక్కి వీరంగం చేసినా, ఆమెపై కేసు నమోదు చేయలేదు. అధికార పార్టీ నిర్వహించిన అన్ని రచ్చబండ కార్యక్రమాల్లోను తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. కాగా పుత్తూరులో రూ.25 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా, ప్రారంభించక పోవడంతో నగిరి ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడును స్థానికులు రచ్చబండలో అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నేతల కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారంటూ ప్రజలు ఆరోపించడంతో, ముద్దుకృష్ణమ నాయుడు వెళ్లి ఆ బ్రిడ్జిని ప్రారంభించారు. కలెక్టర్ రాంగోపాల్ రచ్చబండ షెడ్యూలును ముందుగా ప్రకటించినా, దాని ప్రకారం అధికారులు కార్యక్రమాలు నిర్వహించలేదు.
రచ్చగా ముగిసిన ‘రచ్చబండ’
Published Wed, Nov 27 2013 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement