సాక్షి, విజయనగరం: జన్మభూమి కార్యక్రమం పేదోడికి భరోసా ఇవ్వలేకపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని, జనసేన పార్టీకి చిహ్నం(సింబల్) లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవారని గతంలో చింతా మోహన్ వ్యాఖ్యానించారు. అప్పుడే రాజకీయాల్లోకి చిరంజీవిని రమ్మని తాను కోరినట్లు వెల్లడించారు. కాపులు, దళితులు ఏకమై రాజ్యాధికారం సాధించాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment