సాక్షి, పోలవరం/పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లే రోడ్డు శనివారం ఒక్కసారిగా పైకి చొచ్చుకొచ్చి బీటలువారిన సంగతి తెలిసిందే. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఏజెన్సీ ప్రాంతానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. (పోలవరం ప్రాజెక్టు వద్ద కలకలం)
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ పోలవరం రోడ్డు ఘటనపై వివరణ ఇవ్వాలి. రోడ్డు కిలోమీటర్ మేర ఇంత దారుణంగా దెబ్బతినడాన్ని రియల్ టైం గవర్నెన్స్ టీమ్ గ్రహించిందా? కారణాలేంటో చెప్తారా? కొంపతీసి పోలవరం ప్రాంతంలో భూకంపం వచ్చిందంటారా? ప్రజలను అయోమయంలో పడేయకుండా.. కొంచెం క్లారిటీ ఇవ్వండని పవన్ ట్విటర్లో వ్యాఖ్యానించారు.
I hope Hon. CM Sri. CBN garu’s real time governance has noticed how a road of one kilometre near Polavaram Project had split as if some earthquake occurred. Please give a clarity to peoplewhy it happened. pic.twitter.com/P51oInegy2
— Pawan Kalyan (@PawanKalyan) November 4, 2018
Comments
Please login to add a commentAdd a comment