ఢిల్లీ: ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పులివెందుల మీటింగ్‌లో తనపై చేసిన విమర్శలకు ఢిల్లీ వేదికగా ఘాటుగా స్పందించారాయన. తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడని.. ఆ మాటకొస్తే పొలవరాన్ని అనుకున్న టైంకి ఎందుకు పూర్తి చేయలేకపోయారని చంద్రబాబును నిలదీశారాయన.
‘‘చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అంబోతులకు ఆవులు సప్లయి చేసి రాజకీయాలలో పైకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది. పోలవరం 2018కల్లా చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదు ?. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు?. కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయా ఫ్రం వాల్ ఎందుకు కట్టారు ?. రాయల సీమలో ఒక్క ప్రాజెక్టు కు అయినా బాబు శంకుస్థాపన చేశారా ? అని నిలదీశారాయన.
బ్రో సినిమాలో నన్ను గిల్లారు
బ్రో చచ్చిన సినిమా. అయినా బ్రో సినిమా గురించి నేను మాట్లాడితే చంద్రబాబుకి ఏం నొప్పి?. బ్రో సినిమాలో నన్ను పొలి ఉన్న క్యారెక్టర్ చూపించి నన్ను గిల్లారు. నా పేరు తో సినిమా క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారు అందుకే నేనీ సినిమా గురించి మాట్లాడుతున్నా. బ్రో సినిమాకి పవన్ నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు?. నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి అని డిమాండ్ చేశారు.
వాళ్ల చలవవల్లే..
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎకరాకు అయినా నీరిచ్చావా?.. ఇవ్వలేదు అంటూ చంద్రబాబుపై అంబటి ఫైర్ అయ్యారు. ఆ 14 ఏళ్లు ఏం చేయలేనివాళ్లు.. ఇప్పుడేం చేస్తారు. రాయలసీమ ప్రాజెక్టులు దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్ చలవ వల్లే పూర్తయ్యాయి.
ఢిల్లీ పర్యటన సారాంశం
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిశా. పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని కోరాను. డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బ తింది. కొత్తది కట్టడానికి, రిపేర్లకు దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుంది. గైడ్ బండ్ కుంగడానికి కారణాలు తెలుసుకోవడానికి నిజ నిర్ధరణ కమిటీ వేశాం అని అంబటి మీడియాకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment