చింతా మోహన్
తిరుపతి: ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చేశారు. ఓటర్లను ఏదోఒక విధంగా ప్రలోభాలకు లోను చేస్తున్నారు. కులం, డబ్బు ... ఎక్కడ ఏది అవసరమైతే దానిని వాడేసుకుంటున్నారు. వారికి గెలవటమే ధేయం తప్ప మరోటిలేదు.
తిరుపతిలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చింతా మోహన్ ఓటర్లకు డబ్బు ఎరవేశారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఏకంగా తన తన ఇంటి వద్దే డబ్బు పంపిణీ మొదలు పెట్టారని సమాచారం. ఓటర్లు డబ్బుల కోసం చింతా ఇంటి వద్ద బారులు తీరారు.
ఇదిలా ఉంటే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుపతి ఈసారి ఎన్నికలలో తరచూ వార్తలకెక్కుతోంది. బిజెపి-టిడిపి కూటమి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా తమ ఎన్నికల ప్రచార కరపత్రాలలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఫొటోను ముద్రించారు. ఈ రోజు ఈ సంఘటన మరో సంచలనం.