సీఎం పర్యటన ఖరారు | Kiran Kumar Reddy friday tour in Penugonda | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఖరారు

Published Fri, Nov 15 2013 3:07 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Kiran Kumar Reddy friday  tour in Penugonda

ఏలూరు, న్యూస్‌లైన్ :ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 3 గంట లకు పెనుగొండలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయూనికి చేరుకుం టారు. అక్కడ అధికారులను, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రయూణించి 3.30 గంటలకు పోడూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే రచ్చబండ  సభలో పాల్గొంటారు. వివిధ పథకాల కింద ఉపకరణాలు, మంజూరు పత్రాలు అందిస్తారు.  సాయంత్రం 6గంటలకు పెనుగొండ ఏఎంసీ అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement