వాతాపి జీర్ణం | mahabubnagar district news | Sakshi
Sakshi News home page

వాతాపి జీర్ణం

Published Mon, Feb 3 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM

జిల్లాలో రేషన్ అదనపుకోటా గుట్టుగా మా యమవుతోంది. ఈ తతంగం మూడునెలలుగా జరుగుతున్నా పట్టించునేనాధుడే లేడు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో రేషన్ అదనపుకోటా గుట్టుగా మా యమవుతోంది. ఈ తతంగం మూడునెలలుగా జరుగుతున్నా పట్టించునేనాధుడే లేడు. మూడోవిడత రచ్చబండ కార్యక్రమంలో జిల్లాకు 1,32,515కూపన్లు మంజూరు కాగా, వీటిలో 1,16,187 కూపన్లను మాత్రమే పంపిణీ చేసి, 16,328 కూపన్లను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు ధ్రు వీకరిస్తున్నారు.
 
 వెనక్కి తీసుకున్నవాటిలో ఒకరు ఉన్నవి 1582, ఇద్దరు గలవి 4216, ముగ్గురికి సంబంధించి 3856, నలుగురు 4081, ఐదుగురు ఆ పైగా కుటుంబసభ్యులు ఉ న్న కూపన్లు 2593 ఉన్నాయి. వీటికి సంబంధించి నెలకు రెం డువేల క్వింటాళ్ల బియ్యాన్ని యథాతదంగా పంపిణీ చేస్తున్నారు. ఇలా ప్రతినెలకు 18వేల మెట్రిక్‌టన్నుల చొప్పున జి ల్లాకు కేటాయిస్తున్నారు. అయితే పంపిణీ చేయని రేషన్‌కూపన్లపై వస్తున్న బియ్యంకోటాను డీలర్లతో కుమ్మకై పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈమూడునెలల పాటు బియ్యం అక్రమవ్యాపారం గుట్టుగా సాగుతోం ది.
 
 ఇదిలాఉండగా, ప్రతినెలా రేషన్‌షాపులపై దాడులుచేసి, నిల్వ, విక్రయస్టాక్ తేడాలు ఉన్న వారిపై కేసులు నమోదుచే సే అధికారులకు ఈ కోటా కనిపించడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. అధికారులు కావాలనే ఈ కోటాను పట్టించుకోవడం లేదనే సందేహం అందరిలోనూ నెలకొంది. కానీ ఈ దీన్ని అరికట్టాల్సిన రెండుశాఖలు మాత్రం ఈకోటాపై అశ్చర్యాన్ని కలిగిందే రీతిలో సమాధా నం చెబుతున్నారు. జిల్లాకు వచ్చే కోటాను డీడీల ప్రకారమే అందిస్తామని సివిల్ సఫ్లై కార్పొరేషన్ చెబుతుండగా, సకాలంలో డీడీలను కట్టించడమే తమ బాధ్యత అని సివిల్‌సఫ్లై శాఖ చెబుతోంది. ఈరెండు శాఖలు ఇలా చెబితే అడ్డుకట్టవేసేదెవరు? అక్రమార్కులపై చర్యలు తీసుకునేదెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 
 కూపన్ల డబ్బులు పెండింగే!
 ప్రతికూపన్ పంపిణీ చేసేటప్పుడు సంబంధిత లబ్ధిదారుల నుంచి ఐదు రూపాయలు వసూలు చేస్తారు. ఇలా వసూలు చేసిన డబ్బును కూడా పెండింగ్‌లోనే ఉంచారు. మంజూరైన కూపన్లకు సంబంధించి రూ.5,80,935 రావాల్సి ఉండగా, ఇంతవరకు రూ.3,01,860 చెల్లించారు. ఇక పంపిణీ చేయని కూపన్లకు సంబంధించి రూ.81,640 మినహా, రూ.1,97,435ను పెండింగ్‌లో పెట్టారు. వీటిని ఎవరు చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారో అధికారులకే తెలియాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement