
రచ్చబండకు వచ్చిన మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్
కడప : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారుతోంది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా కడప రచ్చబండ కార్యక్రమంలో మంగళవారం పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రచ్చబండకు వచ్చిన మహిళలపై వారు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రెచ్చిపోయి దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు.
మరోవైపు అనంతపురంలో రచ్చబండ రసాభాసగా మారింది. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీశారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.