
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఈ నెల 11,12 తేదీల్లో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ శాసనసభ్యులకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఈ రెండు రోజుల్లో, నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమస్యలను తెలుసుకుంటూ శాసనసభ్యులు, నియోజవకర్గ సమన్వయకర్తలు ఆయా కాలనీల్లోనే నిద్ర చేస్తారు. ఆయాన నియోజవర్గాల్లో సమస్యలను, మొత్తంగా సామాజికవర్గాల వారి సమస్యలను తెలుసుకుని ఆ అంశాలను పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు వస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.