
1,32,000 ఇళ్లు రద్దు!
హన్మకొండ : వివిధ పథకాల్లో ఇళ్లు మంజూరైనా... ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించని ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న లబ్ధిదారుల జాబితాను తొలగించింది. ఫలితంగా 1,32,000 మంది లబ్ధిదారులు ఇళ్లనుకోల్పోతున్నారు. నిర్మాణాలు మధ్యలో నిలిపివేసిన 1,23,000 మంది లబ్ధిదారుల బిల్లులను విడుదల చేయాలా... ఇప్పటివరకు చెల్లించిన వరకే పరిమితం చేయాలా... అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ముందు నుంచీ అనుకున్నట్లుగానే.. ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వం అందించే సాయం సరిపోక ఇంటి నిర్మాణాలను ప్రారంభించకుండా ఉన్న సామాన్యుల ఇళ్లు రద్దయ్యూరుు.
సదరు లబ్ధిదారులకు తాజా జాబితాలో అవకాశం కల్పిస్తారా... అనే అంశం ప్రశ్నార్థకంగానే మిగిలింది. గృహ నిర్మాణ సంస్థ అధికారులు సైతం ఎ టూ చెప్పలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ పథకంలో మూడు విడతలు, రచ్చబండ సభల్లో 4,30,000 ఇళ్లు మంజూరయ్యూరుు. ఇప్పటివరకూ 1,32,000 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదు. వీటిలో ఎక్కువగా రచ్చబండ సభల్లో మంజూరైనవే. రదైన వాటిలో ఇందిరమ్మ మూడు విడతల్లో మంజూరైన 62,000, రచ్చబండ సభల్లో మంజూరైన 70,000 ఇళ్లు ఉన్నారుు. గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సాయం సరిపోవడం లేదనే కారణాలతో సదరు లబ్ధిదారులు నిర్మాణాలు మొదలుపెట్టలేదు.
ఫిబ్రవరి 24 నుంచి ‘ఆన్‌లైన్’కు తాళం
ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సంస్థ ఆన్‌లైన్‌కు తా ళం పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఇంటి బిల్లు కూడా మంజూరుకు నోచుకోలేదు. ఫిబ్రవరి 24కు ముందే బేస్‌మెంట్, స్లాబ్ లెవల్ వరకు బిల్లులు చెల్లించేందుకు దాదాపు 31,000 ఇళ్ల రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాటికి సంబంధించిన బిల్లులు సైతం విడుదల కాలేదు. తాజాగా ప్రభుత్వం జిలాలో పెండింగ్‌లో ఉన్న 1,32,000 ఇళ్లను ఆన్‌లైన్ జాబితా నుంచి తొలగించింది.
ఇవెట్లా..?
మరో 1,23,000 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నారుు. బేస్‌మెంట్ నుంచి ఆర్‌ఎల్, స్లాబ్ లెవల్ వరకు నిర్మించి మధ్యలో నిలిచిపోరుున ఇళ్లున్నాయి. వీటిని యధావిధిగా కొనసాగిస్తారా... లేక ఇప్పటివరకు బిల్లులు చెల్లించి వదిలేస్తారా... అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏ దశలోనైతే నిర్మాణం ఆగిపోరుుందో అక్కడివరకు మాత్రమే బిల్లులు చెల్లిస్తారని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 1.23 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయినట్లే.
కొత్తవి ఎప్పుడో..
రచ్చబండ సభలతోపాటు గ్రీవెన్స్‌సెల్, వివిధ కార్యక్రమా ల్లో కొత్త ఇళ్ల కోసం 1,43,000 దరఖాస్తులు వచ్చాయి. వాటి ని గ్రామస్థాయిలో పరిశీలించిన అధికారులు 1,21,000 మం దిని అర్హులుగా తేల్చారు. వాటికి అప్పుడో,ఇప్పుడో ఇళ్ల ను మంజూరు చేస్తారని దరఖాస్తుదారులు ఆశతో ఉన్నారు. ఈ జాబితాను తొలగించి, కొత్తగా దరఖాస్తులు తీసుకుని... ప్ర భుత్వ నిబంధనలకనుగుణంగా పరిశీలన చేసిన అనంతర మే కొత్త ఇళ్లుమంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.