'బాబు కోరికలన్నీ బడ్జెట్లో పెట్టారు' | C Ramachandraiah takes on TDP Government due to state finance budget | Sakshi
Sakshi News home page

'బాబు కోరికలన్నీ బడ్జెట్లో పెట్టారు'

Published Wed, Aug 20 2014 1:21 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'బాబు కోరికలన్నీ బడ్జెట్లో పెట్టారు' - Sakshi

'బాబు కోరికలన్నీ బడ్జెట్లో పెట్టారు'

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రమాదకరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంఎల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రమాదకరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంఎల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్పై రామచంద్రయ్య స్పందించారు. ఇది ఆచరణ సాధ్యమయ్యే బడ్జెట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బాబు కోరికలన్నీ బడ్జెట్లో పెట్టారని ఎద్దేవా చేశారు. వనరులు ఎక్కడి నుంచి తెస్తారో మాత్రం విస్మరించారని ఆరోపించారు.

ప్రజలపై పన్నులు వేయడమో లేక ప్రభుత్వమే ఖర్చులు తగ్గించుకుంటేనే కానీ ఈ బడ్జెట్ అమలు అయ్యే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నడుమ ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సి.రామచంద్రయ్య చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement