ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని అడిగే ధైర్యం కూడా సీఎం చంద్రబాబునాయుడు చేయలేకపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత సీ రామచంద్రయ్య విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని అడిగే ధైర్యం కూడా సీఎం చంద్రబాబునాయుడు చేయలేకపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు ఇద్దరూ రైతువ్యతిరేకులేనని పేర్కొన్నారు.
ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలు విస్మరించడం మోదీ, బాబులకు అలవాటు అని చెప్పారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు రూ. 400 కోట్లు ఎలా ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.