
వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాపై వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరిచి అందరితో కలిసి హోదా కోసం పోరాడాలని సూచించారు.
జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లెక్కలపై కమిటీ కాకుండా జరిగిన అన్యాయంపై కమిటీ వేయాలని సూచించారు. అన్ని పార్టీలు కలిసి బీజేపీపై పోరాటం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment