
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య
వైఎస్సార్ జిల్లా : ‘ఓటుకు నోటు’ కేసు నుంచి బయటపడేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపు, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరశనగా రాయచోటిలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ తీసింది. ఈ ర్యాలీలో రామచంద్రయ్య పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ..బడ్జెట్ కేటాయింపు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బాబు నోరు ఎందుకు మెదపటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
16 నెలల పాటు చంద్రబాబు నాయుడికి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని, ఇది చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. బీజేపీతో జగన్ చెలిమికి తహతహలాడున్నాడని చంద్రబాబు విష ప్రచారం మొదలుపెట్టాడని అన్నారు. బాబు నిజాయతీ పరుడైతే నాలుగేళ్లుగా మతతత్వ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎలా కొనసాగుతున్నాడని సూటిగా అడిగారు.?
Comments
Please login to add a commentAdd a comment