'మోదీ సర్వేలో చంద్రబాబుకు 8వ స్థానం'
కడప(వైఎస్సార్ జిల్లా): అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీ చేయించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఎనిమిదో స్థానం వచ్చిందని శాసనమండలి ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు తన చుట్టూ ఒక రకమైన ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో ప్రజలను బతకముంటున్నారని విమర్శించారు.
రాయలసీమ కరువుతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. కరువుపై తాను చేయించిన సర్వేను తానే నమ్మలేని పరిస్థితిలో ఆయన ఉన్నారని అన్నారు.