సాక్షి, కడప: తన రాజకీయ లబ్ధి కోసమే సీఎం చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని బూచిగా చూపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన తప్పటడుగులతోనే సాగుతోందన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయలేరని, ఎవరో ఒకరికి కూటమిగా ఏర్పాటు చేసుకునే అధికారంలోకి వస్తున్నారన్నారు.
చంద్రబాబు పొత్తు కారణంగా బీజేపీ బలైంది.. తన వ్యక్తిగత వైఫల్యాలు పక్క దారి పట్టించేందుకు చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని ప్రజలు గుర్తించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏం నేరవేర్చారో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలన డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి దీక్ష చేయడం ఏంటని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని తెలిపారు. చంద్రబాబు లీకులు మాత్రమే ఇస్తారని, నేరుగా చెప్పరని రామచంద్రయ్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment