రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 38 వేల దేవాలయాలను పరిరక్షించడంతో పాటు అభివృద్ధి పర్చడానికి తమ ప్రభుత్వం కృషిచేస్తోందని, నిరాదరణకు గురై శిథిలావస్థకు చేరిన ఆలయాలను ధూప దీప నైవేద్య పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నామ ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు.
కామారెడ్డి, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 38 వేల దేవాలయాలను పరిరక్షించడంతో పాటు అభివృద్ధి పర్చడానికి తమ ప్రభుత్వం కృషిచేస్తోందని, నిరాదరణకు గురై శిథిలావస్థకు చేరిన ఆలయాలను ధూప దీప నైవేద్య పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నామ ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. ఆదివారం కామారెడ్డిలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ... జిల్లాలో 15 ఆలయాల అభివృద్ధికి రూ.3.24 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆయా ఆలయాలకు టీటీడీ ద్వారా మైక్ సెట్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో మరో 18 దేవాల యాలను ధూప దీప నైవేద్యం పథకం కింద ఎంపిక చేసి పునరుద్ధరణకు కృషిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ముస్లిం అయినప్పటికి నియోజకవర్గంలో హిందూ ఆలయాల అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
అభివృద్ధి చేసేవారిని ఆదరించండి : ఎంపీ
కుల మతాలకతీతంగా అభివృద్ధికి కృషిచేస్తున్న వారిని ప్రజ లు ఆదరించాలని జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్ అన్నా రు. కామారెడ్డి నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలు తీసుకువస్తున్న ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీకి అందరూ అండగా నిలవాలని కోరారు.
దేవాలయాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ
కామారెడ్డి నియోజకవర్గంలో పురాతన ఆలయాలను అభివృ ద్ధి చేయడానికి తాను ధూప దీప నైవేద్యం పథకం ద్వారా 42 ఆలయాలకు గతంలో నిధులు మంజూరు చేయించానని, ఇప్పుడు 18 ఆలయాలకు నిధులు మంజూరు చేయించానని తెలిపారు. నియోజకవర్గంలో 200 వరకు ఉన్న పురాతన ఆల యాల అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి రామచంద్రయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆలయాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గబ్బుల బాలయ్య, శ్రీనివాస్, రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు ఇలియాస్, అశోక్‌రెడ్డి, రాజిరెడ్డి, అంజయ్య, మోహన్‌రెడ్డి, వేణుగోపాల్‌గౌడ్, నల్లవెల్లి అశోక్, ఆకుల శ్రీనివాస్, జమునా రాథోడ్, పంపరి శ్రీనివాస్, భీంరెడ్డి, సునీల్‌కుమార్ పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా డీఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు కృష్ణ, సుభాష్‌చంద్రబోస్, సర్ధార్‌సింగ్, ఎస్సైలు సంగమేశ్వర్, అశోక్, సైదయ్య, నవీన్ బందోబస్తు నిర్వహించారు.
లక్ష్మీనర్సింహస్వామి ఆలయగోపురానికి శంకుస్థాపన
మాచారెడ్డి : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి రామచంద్రయ్య అన్నారు. ఆదివారం మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ఐదంతస్థుల రాజగోపుర నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. చుక్కాపూర్ ఆలయ ప్రాంగణంలో టీటీడీ ద్వారా కల్యాణ మండపం నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. 18 ఆలయాల అభివృద్ధికి దేవాలయాల నుంచి రూ.25 వే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే రూ.3 లక్షల చొప్పున అందిస్తామన్నారు. సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఎంపీ సురేష్‌షెట్కార్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, డీసీసీబీ మాజీ చైర్మన్ రాజిరెడ్డి, నాయకులు, శ్రీనివాస్, కృష్ణమూర్తి, నర్సాగౌడ్, నర్సింహారెడ్డి, వెంకట్‌రాములు, శ్రీనివాసచారి, స్వామిగౌడ్, సంతోష్, విష్ణు, వరలక్ష్మి, సర్పంచ్‌లు లక్ష్మి, సిద్దవ్వ తదితరులు పాల్గొన్నారు.