
'కలవరపడుతున్న చంద్రబాబు'
హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే బీజేపీకి ఆగ్రహం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు కలవరపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య బుధవారం హైదరాబాద్లో ఆరోపించారు. అందుకోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీ సర్కార్పై బాబు ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. అలాగే కేంద్రంలోని బీజేపీ వల్ల తమ ప్రభుత్వానికి ముప్పు ఉందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారన్నారు.
రాష్ట్రంలోని తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలనేది ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అజెండా అని సి.రామచంద్రయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు.