కడప: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బిల్లును ఆర్థిక బిల్లు అనడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిపాటు చర్చ జరిగిన తర్వాత ఆర్థిక బిల్లు అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు పలికే అవకాశం ఉన్నా శల్యసారథ్యం చేస్తున్నారని సి.రామచంద్రయ్య విమర్శించారు.
'హోదా బిల్లును ఆర్థిక బిల్లు అనడం హాస్యాస్పదం'
Published Tue, Jul 26 2016 7:28 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement