'అందరినీ అరెస్టు చేయాలంటే కొత్త జైళ్లు కట్టాలి' | congress leader c. ramachandraiah slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

'అందరినీ అరెస్టు చేయాలంటే కొత్త జైళ్లు కట్టాలి'

Published Wed, Feb 10 2016 1:36 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

congress leader c. ramachandraiah slams chandrababu naidu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ చంద్రబాబు విద్యార్థి దశ నుంచే కుల రాజకీయాలు చేశారని ఆరోపించారు. బాబు పాలనలో ఉన్నదంతా కులతత్వమేనని, కుల ప్రాతిపదికనే అధికారుల నియామకాలు ఉంటున్నాయన్నారు. తుని ఘటనపై రాయలసీమ వారే కారణమని ఎలా ఆరోపిస్తారని ఆయన ప్రశ్నించారు.

తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబే నేరస్థుడని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రితో ప్రకటన చేయించాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. కాపుల తర్వాత రైతులు, యువత రోడ్లెక్కుతారని, అందరినీ అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు కొత్త జైళ్లు కట్టాలని ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement