హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని శనివారానికి వాయిదా వేశారు. శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. ఈ నెల 29, 30 తేదీల్లో సభకు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని పేర్కొంటూ విప్ జారీ చేశారు.
మండలిలో మంగళవారం ఇసుక మాఫియాపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మధ్య వాగ్వాదం జరిగింది.ఇసుక పేరుతో దోచుకుంది మీరంటే మీరేనంటూ ఇరువులు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కాసేపు సభలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చైర్మన్ ఘంగా చక్రపాణి ఇరువురు నేతలకు సర్దిచెప్పి చర్చను ముగించారు. అనంతరం మండలిని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.