ఏపీ కౌన్సిల్ సమావేశాలకు స్వామిగౌడ్ | swamy goud attends andhra pradesh council session | Sakshi
Sakshi News home page

ఏపీ కౌన్సిల్ సమావేశాలకు స్వామిగౌడ్

Published Wed, Aug 27 2014 11:08 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

swamy goud attends andhra pradesh council session

హైదరాబాద్ : తెలంగాణ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌.. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం మండలిలో ఏపీ బడ్జెట్‌పై చర్చ జరుగుతుండటంతో ఆసక్తిగా గమనించారు. వచ్చే నెల్లో తెలంగాణలోనూ బడ్జెట్‌ సమావేశాలు ఉండటంతో సెషన్స్‌ ఎలా జరుగుతాయో చూశారు. అతిథిగా హాజరైన స్వామిగౌడ్‌కు వీఐపీ గ్యాలరీలో ప్రత్యేక మర్యాదలు చేశారు.

స్వామిగౌడ్‌ రాకను ఏపీ మండలి చైర్మన్‌ చక్రపాణితో సహా మిగిలిన మంత్రులు కూడా స్వాగతించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. కలిసి అభివృద్ధి సాధించడంలో భాగంగానే ఆయన ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు.  ప్రతిరోజూ టీవీలో ఏపీ మండలి వ్యవహారాలను చూసే స్వామిగౌడ్‌.. ఇవాళ ప్రత్యక్షంగా మండలికి హాజరయ్యారు. సమావేశాలే బాగా జరుగుతున్నాయని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement