swamygoud
-
టీఆర్ఎస్ లో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్
-
హెడ్సెట్ విసిరితే గాయం అవుతుందా?
న్యూఢిల్లీ: ‘హెడ్సెట్ విసిరితే కంటికి గాయం అయ్యే పరిస్థితి ఎక్కడైనా ఉందా..?’అని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్సెట్ వల్ల, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రామాకు తెరలేపారని ఆయన విమర్శించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజజీవితంలోనే కేసీఆర్ సినిమా చూపిస్తున్నాడు. టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలను ప్రజలు విశ్వసించరు. కేసీఆర్ ఇన్ని నాటకాలు ఆడతాడని ముందే తెలిసుంటే యూత్‌కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే కేసీఆర్ మెడలు వంచేవాడిన’ని వీహెచ్ తెలిప. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం సభ ప్రారంభం కాగానే హెడ్ సెట్ ఘటనపై శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ 11మంది కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ ప్రకటన చేశారు. కాగాబడ్జెట్ సమావేశాల తొలి రోజునే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆందోళన అదుపు తప్పింది. ఏకంగా ప్లకార్డులు, కాగితాలు, హెడ్సెట్లతో కాంగ్రెస్ సభ్యులు దాడికి దిగటంతో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. తమ సీట్లకు అమర్చిన హెడ్‌ఫోన్స్‌ను విరిచేసి గవర్నర్ వైపు గురి చేసి విసిరారు. తన సీటుపై నిలబడి దాడి చేశారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి తనంతట తానే అదుపు తప్పి టేబుల్‌పై పడ్డారు. రెండోసారి విసిరిన హెడ్‌ఫోన్స్ ఏకంగా గవర్నర్ ప్రసంగిస్తున్న వేదికపైకి దూసుకెళ్లింది. వెనుక ఉన్న గోడకు తగిలి గవర్నర్ పక్క సీటులో ఉన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలింది. దీంతో ఆయన కంటికి గాయమైంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించారు. ఆయనను ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. -
‘డైలాగ్స్ పలకడంలో ఆయనకు ఆయనే సాటి’
‘‘ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడం సుబ్బరామిరెడ్డిగారికే సాధ్యం. కళాకారులను సన్మానించడానికి ఆయన 120 ఏళ్లు జీవించి ఉండాలి’’ అని మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు అన్నారు. ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి బుధవారం ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు మంచు మోహన్‌బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాసాగర్ రావు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ తర్వాత తెలుగే అని మనం సగర్వంగా చెప్పుకోవాలి. మారుమూల ప్రాంతాల్లోని పేద కళాకారులను సైతం గుర్తించి సన్మానం చేయాలని సుబ్బరామిరెడ్డిగారికి నేను మనవి చేస్తున్నా. ప్రపంచంలోని తెలుగువారందర్నీ కలిపి ఓ వెబ్సైట్ తయారు చేయాలి. తెలుగు భాషకు సంబంధించిన చరిత్ర, అన్ని విషయాలు అందులో ఉండేలా చూడాలి. తెలుగు భాష పేద విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుందనే విషయం మరచిపోకూడదు. సిటీల్లో గ్రాడ్యుయేషన్ వరకూ చదవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. పల్లె ప్రాంతంలో అయితే దాదాపు ఖర్చు లేకుండానే వాళ్లు చదువుకుంటున్నారు. కానీ, గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంజినీరింగ్ కావొచ్చు.. కలెక్టర్ కావొచ్చు.. ధనిక విద్యార్థులతో పోటీ పడుతున్నారు గ్రామీణ విద్యార్థులు. ఈ శక్తి వారికి ఎలా వచ్చిందంటే తల్లిలా ఉండే తెలుగు భాషవల్లే. తెలుగు భాష వల్ల కొన్ని వేల రూపాయల సబ్సిడీ దొరుకుతోంది. అటువంటి భాషను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కులరహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలి. పదునైన పదజాలాన్ని పలకడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు మోహన్‌బాబుగారు. డైలాగులంటే ఎన్టీఆర్ తర్వాత గుర్తుకు వచ్చే వ్యక్తి మోహన్‌బాబుగారే’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు నటన అద్భుతం. ఐదు తరాల ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న ఆయన ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుకు సంపూర్ణ అర్హులు’’ అన్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబుగారి సినిమాలు భారతీయులు.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజల గుండెల్లో చెక్కబడి ఉంటాయని చెప్పగలను. ఆయన జీవితం అంతా కళారంగానికే అంకితం చేశారు’’ అన్నారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు 42 ఏళ్లలో 600 చిత్రాలకు పైగా నటించారు. భారతదేశ చలనచిత్ర రంగంలో విలన్‌గా ఉండి హీరో అయ్యి 150 సినిమాలు (హీరోగా) చేసిన ఘనత మోహన్‌బాబుది. ఎంత గొప్ప నటుడో అంత ఖలేజా, దమ్ము ఉన్న మనిషి. 14వేల మంది విద్యార్థులున్న కాలేజీ పెట్టి 4వేల మందికి ఉచితంగా విద్య అందిస్తున్నారు. అటువంటి మోహన్‌బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించుకోవడం సంతోషం’’ అన్నారు. అవార్డు గ్రహీత మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మంచి వ్యక్తి అయిన విద్యాసాగర్ రావు నా ఆత్మీయులు కావడం సంతోషం. ఓరుగల్లు అంటే వరంగల్.. పౌరుషాల గడ్డ. ఆ ప్రాంతం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ. కులమతాలకు అతీతంగా తెలుగు వారంతా కలిసి మెలసి ఉండాలని పోరాడిన వీర వనిత రుద్రమదేవి గురించి తెలుసు. డబ్బున్న వాళ్లు ఎందరో ఉంటారు. అందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రాదు. పూర్వం రాజులు చేసేవారు. ఇప్పుడు సుబ్బరామిరెడ్డిగారు చేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని నేనీ స్థాయికి వచ్చా. భక్తవత్సలం నాయుడు అయిన నన్ను మా గురువు దాసరిగారు మోహన్‌బాబుగా మార్చారు. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ని స్థాపించి అన్నగారు ఎన్టీఆర్‌తో కొబ్బరికాయ కొట్టించాను. 1992లో నా ఆస్తులు తాకట్టు పెట్టి ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా తీస్తే అది సిల్వర్ జూబ్లీ హిట్ అయింది. మళ్లీ అన్నగారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టా. ఆ మహానుభావుడు నన్ను రాజ్యసభకు పంపారు. అందరికీ కోపం ఉంటుంది. కానీ, నాకు ఎక్కువ ఉంటుంది. ‘తన కోపమే తన శత్రువు’ అన్నట్టు నా కోపం నాకు నష్టాన్ని కలిగించిందే తప్ప ఎవరికీ నష్టం కలిగించలేదు’’ అన్నారు. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికీ లలిత కళలు బతికి ఉన్నాయంటే సుబ్బరామిరెడ్డిగారిలాంటి వారివల్లే. ‘కాకతీయ కళా పరిషత్’ స్థాపించిన తొలిసారి మోహన్‌బాబుగారిని సత్కరించుకోవడం మా చలనచిత్ర రంగాన్ని సన్మానించడంగా నేను భావిస్తున్నా’’ అన్నారు. హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఏ నుంచి జెడ్ వరకూ మోహన్‌బాబుగారికి అభిమానులే’’ అన్నారు. ఈ సందర్భంగా దివంగత నటులు టీఎల్ కాంతారావు కుటుంబానికి సుబ్బరామిరెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. పలువురు కళాకారులను ఈ వేదికపై సత్కరించారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోలు మంచు విష్ణు, మనోజ్, నటులు అలీ, సంగీత దర్శకుడు కోటి, నటీమణులు జయప్రద, జయసుధ, మంచు లక్ష్మి, హీరోయిన్లు శ్రియ, ప్రగ్యా జైస్వాల్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, డీకే అరుణ, ఎమ్మెల్సీ షబ్బీర్ హుస్సేన్‌తో పాటు డి.శ్రీనివాస్, దానం నాగేందర్, గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. -
బుల్లితెరకు ప్రభుత్వ ప్రోత్సాహం
-
బుల్లితెరకు ప్రభుత్వ ప్రోత్సాహం
సాక్షి, సిటీబ్యూరో: బుల్లితెరకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని శాసనమండలి చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన బుల్లితెర పెద్ద పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పద్మమోహన 26వ వార్షికోత్సవం సందర్భంగా ఆరవ పద్మమోహన టీవీ అవార్డ్స్–2016 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కళలు, కళాకారులు, టీవీ, సినీ రంగాల్లో పనిచేసే వారికి గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తోందని చెప్పారు. టీవీ రంగం అభివృద్ధికి అందులో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం మద్దతుగా ఉంటోందన్నారు. టీఎస్ఎల్సీ డిప్యూటీ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ టీవీ రంగంలో పనిచేసేవారి కోసం ప్రభుత్వం టీవీ నగర్ ఎస్టాబ్లిష్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అన్ని రకాల సౌకర్యాలు తక్షణమే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ అవార్డ్స్ బాధ్యతలను పెంచుతాయన్నారు. సినీ ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పద్మమోహన సంస్థ నిర్వాహకులు సాంస్కృతిక సేవే కాకుండా ప్రజాసేవ కూడా చేయాలని సూచించారు. ప్రత్యేక సత్కారాన్ని సాక్షి టీవీ జర్నలిస్టు స్వప్న అందు కున్నారు. బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డ్‌ను సాక్షి టీవీ న్యూస్ రీడర్ డీవీఎన్ కిషోర్ అందుకున్నారు.అనంతరం ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎ.గురురాజ్‌కి పద్మమోహన్ ప్రతిభా పురస్కా రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, స్పెషల్ జూరీ అవార్డ్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఫిల్మ్ యాక్టర్ సంపూర్ణేష్‌బాబు, టీ న్యూస్ ఎండీ జె.సంతోష్ కుమార్, కేఎంఆర్ ఎస్టేట్ ఎండీ కె.మాధవరెడ్డి, పద్మమోహన వ్యవస్థాపకుడు డి.యాదగిరిగౌడ్ పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
–సీమాంధ్రుల కుట్రలతోనే నీటి ఇబ్బందులు –శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కొత్తూరు: విద్య ద్వారనే దేశం, రాష్ట్రాలు అన్ని రంగాల్లో మరింత అభివద్ధి సాధిస్తాయని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయం భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ను పాఠశాల సిబ్బంది పూలమాలలు, శాలువాతో సన్మానించారు. అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగ అభివద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈస్ట్ ఇండియా వారు ఆంధ్రప్రాంతాన్ని ఆక్రమించుకుని తమ కార్యకలాపాలు నిర్వహించే సమయంలో ఆ పాఠశాలల్లో వారితో పాటు ఆంధ్రుల పిల్లలు సైతం చక్కగా చదువుకున్నట్లు వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్రం నిజాం పాలనలో ఉండడం వల్ల ఇక్కడ సరైన పాఠశాలలు లేక ప్రజలు చదువుకోలేదన్నారు. కుట్రలతోనే నీటి ఎద్దడి.... ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, పాలకులు తమ కుట్రల ద్వార తెలంగాణ ప్రాంతంలోని నిధులతో ఆంధ్రా ప్రాంతంలో అభివద్ధి చేసుకున్నారని వాపోయారు. తెలంగాణ రాష్ట్రం గుండా వందల కిలోమీటర్ల మేర నదులు ప్రవహిస్తున్నప్పటిMీ ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించ లేదన్నారు.అనంతరం హరితహారంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శివశంకర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదమ్మ, జెడ్పీవైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ జగన్, ఆర్వీఎం పీఓ గోవిందరాజులు, ఎంపీటీసీ అనురాధ, స్పెషలాఫీసర్ ప్రియాంక, విద్యార్థులు, అయా శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు. -
స్వామిగౌడ్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనంపై న్యాయస్థానం ఈ మేరకు సోమవారం నోటీసులు ఇచ్చింది. ఏ ప్రాతిపదికన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మార్చి 9న టీడీపీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఎండీ సలీంను గుర్తిస్తూ సీట్లు కేటాయించాలని మండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం అప్పట్లో ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. -
ఏపీ కౌన్సిల్ సమావేశాలకు స్వామిగౌడ్
హైదరాబాద్ : తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్.. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం మండలిలో ఏపీ బడ్జెట్‌పై చర్చ జరుగుతుండటంతో ఆసక్తిగా గమనించారు. వచ్చే నెల్లో తెలంగాణలోనూ బడ్జెట్ సమావేశాలు ఉండటంతో సెషన్స్ ఎలా జరుగుతాయో చూశారు. అతిథిగా హాజరైన స్వామిగౌడ్‌కు వీఐపీ గ్యాలరీలో ప్రత్యేక మర్యాదలు చేశారు. స్వామిగౌడ్ రాకను ఏపీ మండలి చైర్మన్ చక్రపాణితో సహా మిగిలిన మంత్రులు కూడా స్వాగతించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. కలిసి అభివృద్ధి సాధించడంలో భాగంగానే ఆయన ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రతిరోజూ టీవీలో ఏపీ మండలి వ్యవహారాలను చూసే స్వామిగౌడ్.. ఇవాళ ప్రత్యక్షంగా మండలికి హాజరయ్యారు. సమావేశాలే బాగా జరుగుతున్నాయని అభినందించారు.