పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతున్న స్వామిగౌడ్
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
Published Fri, Aug 12 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
–సీమాంధ్రుల కుట్రలతోనే నీటి ఇబ్బందులు
–శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్
కొత్తూరు: విద్య ద్వారనే దేశం, రాష్ట్రాలు అన్ని రంగాల్లో మరింత అభివద్ధి సాధిస్తాయని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయం భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ను పాఠశాల సిబ్బంది పూలమాలలు, శాలువాతో సన్మానించారు. అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యారంగ అభివద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈస్ట్ ఇండియా వారు ఆంధ్రప్రాంతాన్ని ఆక్రమించుకుని తమ కార్యకలాపాలు నిర్వహించే సమయంలో ఆ పాఠశాలల్లో వారితో పాటు ఆంధ్రుల పిల్లలు సైతం చక్కగా చదువుకున్నట్లు వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్రం నిజాం పాలనలో ఉండడం వల్ల ఇక్కడ సరైన పాఠశాలలు లేక ప్రజలు చదువుకోలేదన్నారు.
కుట్రలతోనే నీటి ఎద్దడి....
ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, పాలకులు తమ కుట్రల ద్వార తెలంగాణ ప్రాంతంలోని నిధులతో ఆంధ్రా ప్రాంతంలో అభివద్ధి చేసుకున్నారని వాపోయారు. తెలంగాణ రాష్ట్రం గుండా వందల కిలోమీటర్ల మేర నదులు ప్రవహిస్తున్నప్పటిMీ ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించ లేదన్నారు.అనంతరం హరితహారంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శివశంకర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదమ్మ, జెడ్పీవైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ జగన్, ఆర్‌వీఎం పీఓ గోవిందరాజులు, ఎంపీటీసీ అనురాధ, స్పెషలాఫీసర్ ప్రియాంక, విద్యార్థులు, అయా శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement