న్యూఢిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రైతులు మరోసారి ఉద్యమం బాట పట్టారు. నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ నుంచి నేడు(సోమవారం) రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడా సరిహద్దుల్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. భారతీయ కిసాన్ పరిషత్ నేత సుఖ్బీర్ ఖలీఫా మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలను కోరుతూ రైతులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.
రైతుల డిమాండ్లు ఇవే..
పాత భూసేకరణ చట్టం ప్రకారం బాధిత రైతులకు 10 శాతం ప్లాట్లు, 64.7శాతం పెంచిన పరిహారం ఇవ్వాలి. జనవరి 1, 2014 తర్వాత సేకరించిన భూమికి మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం, 20 శాతం ప్లాట్లు ఇవ్వాలి. భూమిలేని రైతుల పిల్లలకు ఉపాధి, పునరావాసం కల్పించాలి. హైపవర్ కమిటీ ఆమోదించిన అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి.
సరిహద్దుల్లో తనిఖీలు- ట్రాఫిక్ మళ్లింపులు
రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకున్న ఢిల్లీ పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఢిల్లీ సరిహద్దు వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పాక్‌లో తెగల వైరం.. 130 మంది మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment