assitation
-
నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం
న్యూఢిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రైతులు మరోసారి ఉద్యమం బాట పట్టారు. నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ నుంచి నేడు(సోమవారం) రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడా సరిహద్దుల్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. భారతీయ కిసాన్ పరిషత్ నేత సుఖ్బీర్ ఖలీఫా మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలను కోరుతూ రైతులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.రైతుల డిమాండ్లు ఇవే..పాత భూసేకరణ చట్టం ప్రకారం బాధిత రైతులకు 10 శాతం ప్లాట్లు, 64.7శాతం పెంచిన పరిహారం ఇవ్వాలి. జనవరి 1, 2014 తర్వాత సేకరించిన భూమికి మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం, 20 శాతం ప్లాట్లు ఇవ్వాలి. భూమిలేని రైతుల పిల్లలకు ఉపాధి, పునరావాసం కల్పించాలి. హైపవర్ కమిటీ ఆమోదించిన అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి.సరిహద్దుల్లో తనిఖీలు- ట్రాఫిక్ మళ్లింపులురైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకున్న ఢిల్లీ పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఢిల్లీ సరిహద్దు వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్‌లో తెగల వైరం.. 130 మంది మృత్యువాత -
గాలిపటాలతో డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న రైతులు!
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్ ఆందోళన్ 2.0కు బుధవారం రెండవ రోజు. ప్రస్తుతం హర్యానాలోని అంబాలాలోగల శంభు సరిహద్దు దగ్గర రైతులు కాపుగాశారు. గత 36 గంటలుగా రైతులు ఇక్కడి నుంచే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిరంతరం రైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తున్నారు. రైతులు తమ ఆందోళనల్లో భాగంగా ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసుల డ్రోన్లకు ఆటంకం కలిగించేందుకు గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు. ఇందుకోసం రైతులు లెక్కలేనన్ని గాలిపటాలను తీసుకువచ్చి, ఎగురవేయడం ప్రారంభించారు. దీంతో ఆ డ్రోన్లు గాలిపటాల దారాలకు చిక్కుకుని కింద పడిపోతున్నాయి. కాగా శంభు సరిహద్దులో పంజాబ్ నుంచి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు. ఆందోళనలకు కొనసాగిస్తున్న రైతులు డ్రోన్లపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రాళ్లు డ్రోన్లను తాకలేకపోతున్నాయి. మరోవైపు హర్యానాలోని జింద్‌లోని చక్కెర మిల్లును తాత్కాలిక జైలుగా మార్చారు. ఇక్కడ ఒక వైద్యుడు, ఫార్మాసిస్టును నియమించారు. అలాగే గాయపడిన రైతులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ చక్కెర కర్మాగారం జింద్-పాటియాలా-ఢిల్లీ రహదారిలోని ఝంజ్ గ్రామానికి సమీపంలో ఉంది. -
మహిళా సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం
శ్రామిక మహిళ జాతీయ కన్వీనర్ డాక్టర్ కే హేమలత గుంటూరు వెస్ట్ : సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి దేశవ్యాప్త ఆందోళన చేపట్టేందుకు తగిన కార్యాచరణను రూపొందిస్తున్నామని శ్రామిక మహిళ జాతీయ కన్వీనర్ డాక్టర్ కే హేమలత తెలిపారు. గుంటూరులో నిర్వహించిన శ్రామిక మహిళ జాతీయ సభలకు విచ్చేసిన ఆమె శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు, మధ్యాహ్న భోజన పథకం, ఆశావర్కర్లు, బీడీ పరిశ్రమ, మిర్చి తదితర రంగాలతోపాటు, ప్రై వేట్‌రంగంలో మహిళలు లక్షలాది మంది పనిచేస్తున్నప్పటికీ కనీస వేతనాలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేసే మహిళలకు వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, పని ప్రదేశాలలో వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రానున్న శీతాకాల సమావేశాలలో స్మాల్ ఫ్యాక్టరీస్ చట్టాన్ని తీసుకురాబోతున్నదని, దీనిద్వారా 40 మంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలలో కార్మిక చట్టాలు అమలుకావని చెప్పారు. ఈ చట్టం అమల్లోకి వస్తే చిన్నతరహా పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు తీవ్రఅన్యాయం జరుగుతుందన్నారు. నవంబర్ 26 నుంచి 30 వరకు ఒడిశాలోని పూరీలో జరిగే సీఐటీయూ జాతీయ సభలలో కార్మికరంగం, మహిళల సమస్యలపై చర్చించి, కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. సమావేశంలో శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ కే ధనలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే నాగేశ్వరరావు, అధ్యక్షుడు డి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
జీవో 271 ఉపసంహరించకపోతే ఉద్యమం
అఖిలపక్ష రైతు సంఘాల ధర్నా నాదెండ్ల ( గుంటూరు): రైతులు తిరగబడక ముందే ప్రభుత్వం జారీ చేసిన 271 జివోను వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహనరావు డిమాండ్ చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భూ యాజమాన్య హక్కులను హరింపచేసే 255, 271 జీవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్టాప్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి రాజమోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల చేతిలో ఉన్న భూములను బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పేందుకే ఈ ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ జీవోతో రైతుల్లో అశాంతి, అలజడి, ఆందోళన ప్రారంభమయ్యాయని, జీవో ఉపసంహరించుకునేంతవరకూ ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ రికార్డులు 1బీలో ఉన్న తప్పులను పూర్తి స్థాయిలో సవరించేంత వరకూ జీవోను నిలుపుదల చేయాలన్నారు. ఆర్వోఆర్ కాపీ, అడంగల్ కాపీలను పంచాయతీ కార్యాలయాల్లో వీఆర్వో వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామస్థాయిలో జరిగే సాధికారిక సర్వేలో 1బి తదితర అంశాలను పూర్తి స్థాయిలో సవరించాలన్నారు. భూ యాజమాన్య హక్కు పత్రం ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగేలా ఉండాలన్నారు. కంప్యూటర్లో ఉన్న 1బి, అడంగల్‌లో 70 శాతం తప్పులతో ఉన్నాయని, 30 శాతం మాత్రమే స్పష్టంగా ఉన్నాయని, నూరుశాతం రెవెన్యూ రికార్డులు సవరించేంత వరకూ జీవోను నిలుపుదల చేయాలన్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు సవరించకుండానే పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్‌ను రద్దు చేయటం అన్యాయమని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతుల వెన్నుముక విరిచే యత్నం ఏపీ రైతు సంఘం సహాయ కార్యదర్శి బొల్లు శంకరరావు మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నుముక అని చెప్పే నేటి పాలకులు రైతుల వెన్నుముకను విరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ రైతు సంఘం నాయకుడు తాళ్లూరి బాబూరావు మాట్లాడుతూ ఇటీవలే ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను కలిసి పాసుపుస్తకాలను రద్దు చేయొద్దని విన్నవిస్తే ఆయన దాటవేత ధోరణిలో వ్యవహరించారన్నారు. తహశీల్దార్ మేడూరి శిరీష అందుబాటులో లేకపోవటంతో ఆర్ఐ వేణుగోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భారత్‌కిసాన్ సంఘ్ నాయకులు శేఖర్, నల్లమోతు సుబ్బారావు, పెంట్యాల దివాకర్‌బాబు, నల్లమోతు సత్యనారాయణ, బ్రహ్మం, ఐద్వా నాయకురాలు సీహెచ్ అమరమ్మ, జగన్నాధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల విద్యార్థినుల ఆందోళన
♦ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపణ నరసరావుపేటటౌన్: టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు విద్యార్థినులు పాఠశాల ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. పోలీసుల రంగప్రవేశంతో ఆందోళన విరమించారు. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం హర్డ్ బాలికల పాఠశాలలో గత విద్యాసంవత్సరం పదోతరగతి పూర్తిచేసుకొన్న విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం టీసీలు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. విద్యార్థులు తిరిగి అదే పాఠశాలలో నిర్వహిస్తున్న కాళాశాలలో చదవాలనే ఉద్ధేశంతో పాఠశాల యాజమాన్యం వారికి టీసీలు ఇవ్వడం లేదు. ఇది గ్రహించిన విద్యార్థులు గురువారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకొన్న సీఐ సాంబశివరావు అక్కడకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ టీసీలు, మార్కుల సర్టిఫికెట్ల కోసం ఎన్నిసార్లు పాఠశాలకు వచ్చినా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని ఆరోపించారు. ఇప్పటికే తాము ఇతర కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నామని అక్కడి యాజమాన్యం టీసీలు లేనిదే తరగతులకు అనుమతించమని చెబుతున్నారని చెపాపరు. గట్టిగా ప్రశ్నిస్తే తమ కళాశాలలోనే చదవాలని చెబుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ వ్యవహారంపై పాఠశాల యాజమాన్యంతో చర్చింది. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ప్రిన్సిపల్ పాఠశాలలో అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సీఐ ఆమెతో సంప్రదింపులు చేశారు. ఆమె వెంటనే పాఠశాలకు ఫోన్‌చేసి విద్యార్థులకు కావలసిన సర్టిఫికెట్లను అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమింపజేశారు. -
విద్యారంగ సమస్యలపై పోరాటం
విజయవాడ (ఆనందపేట): ప్రత్యేక హోదాపై విద్యార్థులు సంఘటితంగా పోరాడాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఇన్చార్జి సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నూనె పవన్ తేజ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా శైలజనాథ్ మాట్లాడుతూ ఎన్ఎస్యూఐను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు విద్యా సంస్థలు, సంక్షేమ వసతి గహల్లో కమిటీల నియామకాలు చేపట్టాలన్నారు. పవన్‌తేజ మాట్లాడుతూ వసతి గహాల మూసివేతకు నిరసనగా ఈ నెల 29న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. మెస్ చార్జీలు పాఠశాల విద్యార్థులకు రూ.1500, కళాశాల విద్యార్థులకు రూ.2 వేలు పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి కిషోర్ బాబులు సంక్షేమ వసతి గహాల వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్‌వలి, నాయకులు గారా ఉషారాణి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు డీఆర్‌కె చౌదరి, బోడా వెంకట్, కేశవ, గురవ కుమార్ రెడ్డి, తారక్, తదితరులు పాల్గొన్నారు.