బుల్లితెరకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని శాసనమండలి చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన బుల్లితెర పెద్ద పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పద్మమోహన 26వ వార్షికోత్సవం సందర్భంగా ఆరవ పద్మమోహన టీవీ అవార్డ్స్–2016 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.