
'పదవులన్ని సీమకు దక్కిన మాట వాస్తవమే'
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సమ్యలను అధిగమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ సూచించారు.
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సమ్యలను అధిగమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ సూచించారు. ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌కు కొత్తేమి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా సి. రామచంద్రయ్య ఎన్నికైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పదవులన్ని రాయలసీమకు దక్కిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇతర పదవులను కోస్తాంధ్రకు కేటాయిస్తామని చెప్పారు.
శాసనమండలి మండలిలో ప్రతిపక్ష నేత పదవిని క్లిష్ట పరిస్థితుల్లో చేపడతున్నానని సి. రామచంద్రయ్య తెలిపారు. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.