
'రాజధానిపై వివాదానికి ప్రభుత్వమే కారణం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వివాదానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని ఆ రాష్ట్ర కౌన్సిల్లో ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. శుక్రవారం శాసనమండలిలో రాజధానిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు ప్రజల్లో అనవసరమైన ఆశలు రేకెత్తిస్తున్నారని విమర్శించారు.
రాజధాని నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నూతన రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసిన మీరు రాయలసీమ వాసులను ఏవిధంగా శాంతపరుస్తారో తెలపాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. అయితే కర్నూలు జిల్లాకు అన్యాయం చేశారంటూ... శాసనమండలి నుంచి ఎమ్మెల్సీ సుధాకర్బాబు వాకౌట్ చేశారు.