AP Budget 2024: కోతల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్‌ | AP Assembly Budget Sessions 2024 Live Updates On Nov 11 And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

AP Budget 2024 Updates: సూపర్ (సిక్స్) మోసం.. కోతల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్‌

Published Mon, Nov 11 2024 9:39 AM | Last Updated on Mon, Nov 11 2024 1:14 PM

AP Assembly Budget Sessions 2024 Live Updates nov 11

AP Assembly Budget Sessions 2024

మోసం.. దారుణ మోసం

  • సూపర్ 6 తొలి హామీ కి నిధులు కేటాయించని చంద్రబాబు ప్రభుత్వం
  • నిరుద్యోగులకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన ప్రభుత్వం
  • బడ్జెట్ లో ప్రస్తావన లేని రూ. 3 వేలు నిరుద్యోగ భృతి
  • 20 లక్షల ఉద్యోగాలు లేదంటే ప్రతీ నిరుద్యోగికి 3 వేలు భృతి ఇస్తానని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చిన చంద్రబాబు
  • బడ్జెట్ లో కానరాని మహిళలకు ఉచిత బస్ హామీ
  • ఎన్నికల్లో గెలవగానే మహిళలకు ఉచిత బస్ హామీ అమలు చేస్తామన్న చంద్రబాబు

 

కూటమి ప్రభుత్వ కోతల బడ్జెట్‌

  • ఇటు వార్షిక, అటు వ్యవసాయ బడ్జెట్‌లో అన్నీ కోతలే
  • వైఎస్‌ జగన్‌ హయాంలో అన్ని రంగాలకు ప్రోత్సాహం 
  • ఇప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మోసం
  • బడ్జెట్‌ ప్రసంగాల్లోనూ వైఎస్సార్‌సీపీ పాలనపై అక్కసు వెల్లగక్కిన మంత్రులు
  • ఎన్నికల హామీల అమలు పేరుతో భారీగా లబ్ధిదారులకు కోత పెట్టే ప్రయత్నం
  • అందుకే పలు రంగాలకు సగం కంటే తక్కువ కేటాయింపులు!
  • బడ్జెట్‌లో  రైతులు, ఆడపడుచులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు
     

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా
 

తల్లికి వందనం పథకానికి షాక్

  • బడ్జెట్ లో తల్లికి వందనం కి కేవలం 2,491 కోట్లు కేటాయింపు
  • సూపర్ సిక్స్ హామీల్లో స్కూల్ కి వెళ్లిన ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తాం అన్న చంద్రబాబు
  • 10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్న..2,491 కోట్లు మాత్రమే కేటాయింపు
  • ఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే!
  • గతంలో వై ఎస్ జగన్ ప్రభుత్వం లో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు
  • ప్రతి ఏటా 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు జమ చేసిన వై ఎస్ జగన్ ప్రభుత్వం
  • అమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా స్పష్టత ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం

 

మహిళకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం

  • బడ్జెట్ లో కానరాని మహాశక్తి పథకం
  • 19 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో హామీ
  • ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు
  • బడ్జెట్ లో మహిళల కు ఏడాదికి 18,000 ఆర్థిక సాయం ఉసేత్తని ప్రభుత్వం

ఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలా

  • ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ..
  • ఉద్యానశాఖకు రూ.3469.47 కోట్లు..
  • అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు.
  • వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.314.88 కోట్లు..
  • పంటల బీమాకు రూ.1023 కోట్లు.  -మంత్రి అచ్చెన్నాయుడు.

ఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలా

  • రాయితీ విత్తనాలకు - రూ.240 కోట్లు
  • భూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు
  •  విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు
  •  ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు
  •  పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు.
  •  ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు

రైతులకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన ప్రభుత్వం

  • రైతుల పెట్టుబడి సహాయం హామిపై  చంద్రబాబు ప్రభుత్వం పల్టీలు
  • కేంద్రం ఇచ్చే 6 వేలు తో కలిపి ఇస్తామంటూ మెలిక
  • టీడీపీ మేనిఫెస్టోలో రైతులకు 20 వేలు చొప్పున ఇస్తామని ప్రకటన
  • కేవలం 4,500 కోట్లు మాత్రమే అన్నదాత సుఖీభవ కి కేటాయించిన ప్రభుత్వం
  • ఏపీలో పెట్టుబడి సహాయం కి 52 లక్షల మంది 10 వేల కోట్లకు పైగా అవసరం
  • కేవలం 4,500 కోట్లు మాత్రమే కేటాయించి షాక్ ఇచ్చిన ప్రభుత్వం
  • భారీగా లబ్ధిదారులకు కోత పెట్టనున్న ప్రభుత్వం

👉 వ్యవసాయ బడ్జెట్‌ పూర్తి కాపీ కోసం క్లిక్‌ చేయండి

అచ్చెన్న నోట అబద్ధాలు

  • వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
  • రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌
  • జగన్‌ హయాంలో సాఫీగా సాగిన రైతు బీమా
  • బడ్జెట్‌ టైంలో అచ్చెన్న నోట అబద్ధాలు
  • గత ప్రభుత్వం రైతుల పంటలకు బీమా అందించలేదు: అచ్చెన్న
  • వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తాం: అచ్చెన్న

మిగతా వాటిల్లో..

  • ఏపీ రహదారులు రంగానికి రూ.9,554 కోట్ల కేటాయింపు
  • పర్యాటక రంగానికి 322 కోట్ల కేటాయింపు

పవన్‌ శాఖలకు భారీగా..

  • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు
  • పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ 16.739 కోట్లు
  • అటవీ పర్యావరణ శాఖకు 687 కోట్లు

👉:  ఏపీ బడ్జెట్ 2024 పూర్తి కాపీ కోసం క్లిక్‌ చేయండి

బడ్జెట్‌లో అప్పు ఇలా..

  • ఈ ఏడాది 91,443 కోట్లు ప్రజా అప్పులు చెయ్యాలని నిర్ణయం
  • బడ్జెట్ లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం
  • 2 లక్షల 1 వెయ్యి కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా
  • 24,498 కోట్లు అప్పులు చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం

ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు

  • 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..
  • ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు
  •  రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..
  • పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు
  • జలవనరులు రూ.16,705 కోట్లు..
  • ఉన్నత విద్య రూ.2326 కోట్లు..
  • పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..
  • ఇంధన రంగం రూ.8,207 కోట్లు..
  • పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..
  • బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..
  • మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..
  • ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..
  • అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..
  • గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..
  • నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.

ఊహించినట్లే సాగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

  • వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌
  • 2, 94, 427  కోట్ల తో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్
  • రెవెన్యూ లోటు 34,743 కోట్లు
  • ద్రవ్య లోటు 68,742 కోట్లు
  • గత ప్రభుత్వంపై ఆరోపణలతోనే ప్రసంగం మొదలుపెట్టిన పయ్యావుల
  • పతనం అంచున ఆర్థిక వ్యవస్థ : మంత్రి పయ్యావుల
  • విభజన నాటి విషయాల ప్రస్తావన కూడా
  • సమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలి : మంత్రి పయ్యావుల
  • శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగింది : మంత్రి పయ్యావుల
  • రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది : మంత్రి పయ్యావుల
  • గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది.. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదు : మంత్రి పయ్యావుల
  • గత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసింది.. తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగింది: మంత్రి పయ్యావుల
  • రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది : మంత్రి పయ్యావుల
  • 93 శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగింది : మంత్రి పయ్యావుల


 

2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్

  • ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • 10 నుంచి 15 రోజులపాటు సమావేశాలు సాగించే యోచనలో కూటమి ప్రభుత్వం
  • సమావేశాలకు దూరంగా వైఎస్సార్‌సీపీ

 

 

  • అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేది  ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
  • మండలిలో  బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ మంత్రి  కొల్లు రవీంద్ర
  • అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేది మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
  • మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేది మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement