
మరోసారి మభ్యపెడుతున్న బాబు
పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రాయలసీమ ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య విమర్శించారు.
పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రాయలసీమ ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని అన్నారు. సీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటే గాలేరు, నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు పోలవరం నుంచి జలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబుతో ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు.