డెడ్ లైన్..18
Published Tue, Sep 17 2013 4:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
వైవీయూ, న్యూస్‌లైన్: ఈ నెల 18వ తేదీలోపు మంత్రులతో పాటు పార్లమెంట్ సభ్యుడు సాయిప్రతాప్ రాజీనామా చేయాలని హెచ్చరిక పేరుతో రూపొందించిన పోస్టర్‌ను వారి ఇళ్లకు అతికించారు. సోమవారం నగరంలోని ఏడురోడ్ల కూడలి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీబైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యనినాదాలు చేస్తూ తొలుత మంత్రి సి. రామచంద్రయ్య ఇంటివద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ‘హెచ్చరిక’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఇంటికి అతికించారు. సమైక్యద్రోహులు మంత్రులు రాజీనామాలు చేయాలంటూ నినదించారు. అనంతరం మంత్రి అహ్మదుల్లా ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటికి పోస్టర్లు అతికించారు. మంత్రి తనయుడు అషఫ్‌త్రో సమైక్యవాదులు వాగ్వాదానికి దిగారు. సమైక్యవాదులుగా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. అక్కడి నుంచి రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ ఇంటివద్దకు వెళ్లారు. అక్కడ ఆయన ఇంటికి, కారుకు స్టిక్కర్లు అతికించారు. మంత్రులు, ఎంపీలు రాజీనామాలు ఆమోదింపచేసుకుని సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. లేనిపక్షంలో ప్రజాప్రతినిధుల ఇంటి వద్దే దీక్షలకు పూనుకుంటామన్నారు.
పోలీసులతో వాగ్వాదం..
బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న సమైక్యవాదులను సీఐ శివన్న ఆధ్వర్యంలో పోలీసులు ఆడ్డుకునే యత్నం చేశారు. దీనికి సమైక్యవాదులు ప్రతిఘటించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఉద్యమాలు ఎలా చేస్తారంటూ సీఐ ప్రశ్నించడంతో సమైక్యవాదులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఉద్యమాలను ఖాకీజులుంతో అణగదొక్కాలని చూస్తే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు శ్రీనివాసులు, జయరామయ్య, బాలశౌరిరెడ్డి, జమాల్‌రెడ్డి, గంగాధర్, తిరుపాల్, నరసారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, చెన్నకేశవరెడ్డి, శ్రీనివాసులు, రామ్మూర్తి, శంకరయ్య, రవిశంకర్‌రెడ్డి, దామోదర్, శ్రీనివాసయాదవ్, పి.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement