
రాష్ట్రానికి మొండిచేయి చూపారు
మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపారని మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన నిధులు, రాయితీలకు బడ్జెట్‌లో కేటాయింపుల్లేవని సోమవారం ఓ ప్రకటనలో ఆయన దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు గతేడాదిలాగే కేవలం రూ.100 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వీలుగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తక్షణం పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.