'బాబు అలా చేస్తే ఏపీలో రక్తపాతమే' | c ramachandraiah takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబు అలా చేస్తే ఏపీలో రక్తపాతమే'

Published Sat, Jul 16 2016 1:44 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'బాబు అలా చేస్తే ఏపీలో రక్తపాతమే' - Sakshi

'బాబు అలా చేస్తే ఏపీలో రక్తపాతమే'

హైదరాబాద్: అవినీతిలో ఏపీది ప్రథమ స్థానం అని అందుకే ఇక్కడికి పెట్టుబడులు రావని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసినంత మాత్రాన పెట్టుబడులు రావని అన్నారు. ప్రత్యేక హోదా తప్ప రాష్ట్రానికి మరో మార్గం లేదని ఆయన చెప్పారు. అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని, కేంద్రమంత్రులనుక కలిసి ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

వెనుకబడిన జిల్లాల కోసం కేంద్రం కేటాయించిన రూ.700కోట్లలో కేవలం ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారని దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన సాగుతోందని అన్నారు. దేవుళ్లకే భద్రత లేకుండా పోయిందని బెజవాడలో ఆళయాల కూల్చివేత నేపథ్యంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా అటవీ భూములను డీ నోటిఫై చేసి వైఎస్ఆర్ జిల్లాలో అటవీ ప్రాంతాన్ని ఏర్పాటుచేస్తామంటే అక్కడ రక్తపాతమవుతుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement