
ఆ పరిజ్ఞానం కూడా చంద్రబాబుకు లేదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపల ఒకటి జరిగితే బయటకు మరోకటి చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య విమర్శించారు.
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపల ఒకటి జరిగితే బయటకు మరోకటి చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య విమర్శించారు. అన్ని పార్టీలను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లమంటే చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. బుధవారం కడపలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను బాగు చేయాలనే కమిట్మెంట్ చంద్రబాబుకు ఉందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
బీహార్కు ప్యాకేజీ ప్రకటిస్తే.. తమ హక్కు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు, ఆ పరిజ్ఞానం కూడా చంద్రబాబుకు లేదా? అంటూ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారిస్తున్న తీరు దేశ సమగ్రత, ఐక్యత దెబ్బతీశేలా ఉందని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య విమర్శించారు.