
లీజుకు ఇచ్చే అధికారం ఆయనకు ఎక్కడిది?
హైదరాబాద్: ఏపీ రాజధాని అంశంపై ప్రభుత్వం నిగూఢంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య విమర్శించారు. నిగూఢంగా వ్యవహరించడానికి అది ప్రైవేటు రాజధానా, ప్రజారాజధానా అని ప్రశ్నించారు. రాజధాని భూమిని 99 సంవత్సరాలు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చే అధికారం సీఎం చంద్రబాబుకు ఎక్కడిదని అడిగారు.
ప్రజలను మోసం చేసి టీడీపీ కార్యకర్తలను, నేతలను ధనవంతులను చేసే అజెండాను చంద్రబాబు చేపడుతున్నారని ఆరోపించారు. 4 నెలల్లో రూ.12 వేల కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. సీఆర్డీఏకు ఉన్న న్యాయహోదా ఏంటని ప్రశ్నించారు. జీవో 110పై న్యాయ, ప్రజాపోరాటాలు చేస్తామని రామచంద్రయ్య తెలిపారు.