ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక రోగిలా పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక రోగిలా పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. ఏపీ బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరేలా లేవు.. సంక్షేమానికి గండి కొట్టారని మండిపడ్డారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులివ్వకపోవడానికి చంద్రబాబే కారణమని ఆయన ధ్వజమెత్తారు.
పట్టిసీమ ప్రాజెక్టు వల్లే పోలవరానికి నిధులు రావడం లేదని దుయ్యబట్టారు. రాజధాని అంశాన్ని కేంద్రానికి వదిలేస్తేనే నిధులు వస్తాయని సి.రామచంద్రయ్య సూచించారు.