క్షీవాదశి సందర్భంగా గురువారం సాయంత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామి హంసనావికోత్సవం (తెప్పోత్సవం) వైభవంగా జరిగింది. ఉషా, ఛాయా, పద్మినీ సమేత ఆదిత్యుడి ఉత్సవమూర్తులను హంసవాహనంపై కొలువుదీర్చి ఆలయ సమీపంలోని ఇంద్రపుష్కరిణిలో జలవిహారం చేయించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య సింహవాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. కాగా, శ్రీకూర్మంలో కూర్మనాథస్వామివారు అమ్మవార్లతో కలిసి తెప్పలపై కొలువుదీరి శ్వేత పుష్కరిణిలో విహరించారు. స్వామి చక్రనారాయణ స్వామి, శయన పెరుమాళ్లతో కలసి పొలి కోతకు (వరి పంట కోత) వెళ్లారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు.
-న్యూస్‌లైన్, అరసవల్లి (శ్రీకాకుళం)
కార్తీక ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) పర్వదినం సందర్భంగా అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారి తెప్పోత్సవం పంపా నదిలో గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది. సాయంత్రం ఐదున్నర గంటలకు రత్నగిరిపై నుంచి స్వామి, అమ్మవార్లను పంపానదీ తీరానికి తీసుకువచ్చారు.ప్రత్యేక పూజల అన ంతరం రాత్రి 6.45 నుంచి ఎనిమిది గంటల వరకూ హంసవాహనంగా అలంకరించిన తెప్పపై ఉత్సవం వైభవంగా జరిగింది. మంత్రులు సి.రామచంద్రయ్య, తోట నరసింహం, ఎమ్మెల్యేలు పర్వత చిట్టిబాబు, రాజా అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
-న్యూస్‌లైన్, అన్నవరం