
'విచారణకు గవర్నర్ అనుమతి అవసరం లేదు'
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాధారాలతో సహా వెల్లడి అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాధారాలతో సహా వెల్లడి అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేతగా చంద్రబాబు ఎమ్మెల్యేల కొనగోలుకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇంధిరభవన్లో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబును విచారించడానికి తెలంగాణ ఏసీబీకి గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తనకున్న అధికారాలతో చంద్రబాబును విచారించమని గవర్నర్ కూడా ఆదేశించవచ్చునని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చంద్రబాబును విచారించాల్సిందిగా తెలంగాణ ఏసీబీ ఆదేశించవచ్చు' అని అన్నారు. చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయన మానసికంగా ఆందోళన చెందుతున్నారనేందుకు నిదర్శనమని సి. రామచంద్రయ్య పేర్కొన్నారు.