
'భార్యలు ధర్నా చేస్తుంటే భర్తలను అరెస్ట్ చేస్తున్నారు'
అంగన్వాడీ ఉద్యోగుల అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మంగళవారం దద్ధరిల్లింది.
హైదరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మంగళవారం దద్ధరిల్లింది. ఈ అంశంపై వెంటనే సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ విపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది... అయినా తమ ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సభలో తెలిపారు.
మంత్రి సమాధానంపై మండలిలో ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భార్యలు ధర్నా చేస్తుంటే భర్తలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు వెంటనే నెరవేర్చాలని సి.రామచంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.