
'టీడీపీని పవన్ ఎందుకు నిలదీయలేదు'
పవన్ కల్యాణ్ తిరుపతిలో నిర్వహించిన సభలో టీడీపీని ఎందుకు నిలదీయలేదని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు.
వైఎస్‌ఆర్ జిల్లా: సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీని ఎందుకు నిలదీయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. ఆదివారం వైఎస్‌ఆర్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై పవన్ విమర్శలు చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన పవన్.. గతం తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది' అని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీయేనని సి.రామచంద్రయ్య గుర్తు చేశారు.