
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది. ఆగస్టు నెలలో ప్రభుత్వం ప్రారంభించనున్న వనం - మనం కార్యక్రమం, కృష్ణా పుష్కరాలతోపాటు పాలనలో సాంకేతిక అనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో కృష్ణా పుష్కరాల్లో టెండర్లు లేకుండా కేటాయించిన పనులకు కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. అనంతరం వివిధ శాఖాధిపతులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
అయితే అనుమతులు లేకుండా ఇరిగేషన్ శాఖలో దాదాపు రూ. 86 కోట్ల విలువైన పనుల బిల్లుల చెల్లింపునకు ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. కాగా ఈ బిల్లుల చెల్లింపుపై కేబినేట్ ఆమోదం తెలపనుందని తెలిసింది.