పుష్కర పనులపై సీఎం అసంతృప్తి
విజయవాడ: కృష్ణా పుష్కరాల పనులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆగష్టు లో జరిగే కృష్ణా పుష్కరాలు, వనం-మనం కార్యక్రమాలపై చర్చ జరిగింది. రూ. 80 కోట్ల విలువైన పుష్కర పనులకు మంత్రి వర్గం ఆమోదించింది. కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ను రాష్ట్ర అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రేషన్ డీలర్లకు కమీషన్ క్వింటాకు రూ.70 పెంచేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.