పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
– హైదరాబాద్ నుంచి గద్వాలకు 28 సర్వీస్‌లు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణాపుష్కరాలను పురస్కరించ్జుజీని భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. పుష్కరాల కోసం 238 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జిల్లా పరిధిలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి గద్వాల వరకు 28సర్వీస్‌లను నడపడానికి రైల్వేశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రైలు నంబర్ 07950: హైదరాబాద్–గద్వాల–హైదరాబాద్‌కు నాలుగు సర్వీస్‌లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు వచ్చేనెల 11, 18 తేదీల్లో నడుస్తాయి. ఉదయం 5.15 హైదరాబాద్ నుంచి బయలుదేరి గద్వాలకు ఉదయం 10.20 గంటలకు చేరుకుంది. ఆయా తేదీల్లో రిట(07951) రైలు (రిటర్న్ డైరెక్షన్) తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.40 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తి రోడ్‌తో పాటు శ్రీరాంనగర్ స్టేషన్‌ల మీదుగా నడుస్తుంది. ఈ రైలులో ఏసీ–2 టైర్, ఏసీ–3టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
రైలు నంబర్ 07948: సికింద్రాబాద్–గద్వాల–సికింద్రాబాద్‌కు 24 సర్వీస్‌లు తిరుగనున్నాయి. వచ్చేనెల 12 నుంచి 23వ తేదీ వరకు సికింద్రాlబాద్ నుంచి ఉదయం 11.45గంటలకు బయలుదేరి గద్వాలకు మధ్యాహ్నం 3.30 గంటలకు గద్వాలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు(07949) ఆయా రోజుల్లో సాయంత్రం 4.30 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తిరోడ్, శ్రీరాంనగర్ స్టేషన్‌లలో ఆగుతుంది.