విశాఖపట్నం: క్రీడలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్లో రజిత పతకం సాధించిన పివి సింధు, ఆమె కోచ్ పి.గోపిచంద్ను సముచితంగా సత్కరించామని తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ షెడ్యూల్ను విడుదల చేశారు.
అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి 25 వరకు విశాఖపట్నంలో జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. మంగళవారం ముగిసిన కృష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని చెప్పారు. సాంకేతిక అనుసంధానంతో పుష్కరాలు ఘనం నిర్వహించామని గంటా వెల్లడించారు.