national table tennis tournament
-
టేబుల్ టెన్నిస్ సెమీఫైనల్లో తెలంగాణ
గుజరాత్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్ సభ్యులుగా ఉన్న తెలంగాణ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. హరియాణా, గుజరాత్ జట్లపై 3–1తో నెగ్గిన తెలంగాణ 0–3తో మహారాష్ట్ర చేతిలో ఓడింది. జాతీయ క్రీడలు ఈనెల 29 నుంచి జరగనున్నాయి. అయితే అవే తేదీల్లో భారత జట్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో టీటీ ఈవెంట్‌ను ముందుగా నిర్వహిస్తున్నారు. -
జాతీయ టీటీ టోర్నీ ఛాంపియన్‌గా ఆకుల శ్రీజ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో (సౌత్‌జోన్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ)కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ చాంపియన్‌గా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 5–11, 11–7, 7–11, 17–19, 11–4, 11–6, 12–10తో స్వస్తిక ఘోష్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)పై గెలిచింది. శ్రీజకు కోచ్‌గా సోమ్‌నాథ్ ఘోష్, ఫిట్నెస్ కోచ్‌గా హిరాక్ బాగ్చి వ్యవహరించారు. -
శ్రీజ–నిఖత్ జంటకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆకుల శ్రీజ–నిఖత్ బాను (తెలంగాణ) జంట స్వర్ణంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీజ–నిఖత్ ద్వయం 11–2, 11–8, 8–11, 11–7తో అనన్య బసక్–సృష్టి (మహారాష్ట్ర) జోడీపై గెలిచింది. సెమీఫైనల్లో శ్రీజ–నిఖత్ జంట 7–11, 11–7, 15–13, 13–11తో అహిక– ప్రాప్తి సేన్ (పశ్చిమ బెంగాల్) జోడీని ఓడించింది. -
'పుష్కరాలు విజయవంతంగా ముగిశాయి'
విశాఖపట్నం: క్రీడలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించిన పివి సింధు, ఆమె కోచ్ పి.గోపిచంద్‌ను సముచితంగా సత్కరించామని తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి 25 వరకు విశాఖపట్నంలో జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. మంగళవారం ముగిసిన కృష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని చెప్పారు. సాంకేతిక అనుసంధానంతో పుష్కరాలు ఘనం నిర్వహించామని గంటా వెల్లడించారు.