
18న వైఎస్ జగన్ పుష్కర స్నానం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న పుష్కర స్నానం ఆచరించనున్నారు. వాస్తవానికి ఆయన శనివారం (13వ తేదీ) విజయవాడలో పుష్కర స్నానం చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల రేపటి కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.