హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిశారు. కృష్ణ పుష్కరాలకు రావాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ను ఆహ్వానించారు. ఇప్పటికే చంద్రబాబు...ప్రధానమంత్రి, రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా గవర్నర్తో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం బయల్దేరి వెళ్లారు.
కృష్ణా పుష్కరాలకు గవర్నర్కు ఆహ్వానం
Published Mon, Aug 8 2016 9:44 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement
Advertisement