కృష్ణమ్మకు ప్రత్యేక హారతి : మంత్రి పల్లె
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు ప్రారంభ ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్లో గురువారం సాయంత్రం 4 గంటలకు కృష్ణా, గోదావరి సంగమం వద్ద పుష్కరాలు ప్రారంభమవుతాయని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో కృష్ణమ్మ ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పల్లె చెప్పారు.
కృష్ణా పుష్కరాలకు ఘనంగా స్వాగతం పలుకుతామని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. సీఎం చంద్రబాబు కోరిక మేరకు సినీ రంగ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో పుష్కర స్నానం చేస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానంతో కృష్ణా పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే.